MOVIE

శ్రీముఖి అసలు బండారం ఏమిటో బయటపెట్టిన రాహుల్…మరీ ఇంత కుట్రకు దిగజారుతుందా

బిగ్ బాస్ లో కొన్నిరోజుల నుండి గొడవలు,రొమాన్స్ అనేవి జరగటం చూస్తే ఇక రానున్న రోజుల్లో ఇంకెన్ని వివాదాలకు దారితీస్తాయో అన్న అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరిలోనూ వుంది. అయితే మొన్నటికి మొన్న అలీ రెజా మరియు,హిమజల మధ్య పెద్ద గొడవే జరిగిది ఒక దశలో అయితే అలీ కాళ్ళు కూడా పట్టుకుంది హిమజ అయినా కానీ ఆ గొడవకు ఫుల్ స్టాప్ పడలేదు. ఇక టాస్క్ లో భాగమై శ్రీముఖి కూడా తన టాస్క్ ను గెలిచి ,తన నటనను  నిరూపించుకునేందుకు కొన్ని కుట్రలు చేయక తప్పలేదుఅసలు వివరాల్లోకి పోతే…బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఎదో సైలెంట్ వార్ నడుస్తుందని ముందు నుండి చెప్పుకుంటూనే ఉన్నాము. దాదాపు 10 రోజుల నుండి ఇద్దరికీ అసలు పడటం లేదు. అసలేమీ జరిగిందో అనే దానిని బిగ్ బాస్ చూపించలేదు. కారణాలు ఏమైనా కావచ్చు ఒకరు అంటే ఒకరికి అసలు పడటం లేదు.

శ్రీముఖి హౌస్ లో గ్రూప్స్ పాలిటిక్స్ చేస్తుంది. అందరిని ఇంఫులెన్సు చేస్తూ గేమ్ ఆడుతుంది. దానిని డైరెక్ట్ గా పట్టుకొని, ఆధారాలతో మీకు చూపిస్తానంటూ రోహిణి,హిమజ,శివజ్యోతి సమక్ష్యంలో చెప్పాడు రాహుల్.నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో శ్రీముఖి గ్లాస్ బాక్స్ బద్దలు కొట్టటం, ఆ తర్వాత రవికృష్ణ చేతితో బ్రేక్ చేయాలనీ చూడటం, దీనితో అతనికి గాయం కావటం, హౌస్ మేట్స్ అందరు శ్రీముఖిని తప్పు పట్టటం జరిగింది. దీనిని హైలైట్ చేస్తూ నేను చెప్పను కదా.. శ్రీముఖిని ఆధారాలతో పట్టుకుంటానని చూశారుగా మీరే.. దానిని చాలా వరెస్ట్ బిహేవియర్, రవి గాడిని ఇంఫులెన్సు చేసి వాడితో ఆ పని చేపించింది.

నేను చూస్తూనే ఉన్నాను డంబెల్ ఇచ్చి పగలకొట్టామని చెప్పింది ఇప్పటికైనా శ్రీముఖి ఎలాంటిదో తెలుసుకోండని రాహుల్ మాట్లాడాడు.ఇక్కడ గమనిస్తే రాహుల్ పట్టుకుంది ఏమి లేదు.. శ్రీముఖి చేసిన తప్పు ఏమిలేదు. బ్రేక్ చేసే సమయంలో డంబెల్ ఇచ్చి కొట్టమని చెప్పింది కానీ, హ్యాండ్ తో కొట్టమని చెప్పలేదు. టాస్క్ లో గెలవటం కోసమే తాను ఆలా చివరి అస్త్రముగా ఆ పని చేసింది కానీ, ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు. అయితే శ్రీముఖి మీద కామెంట్స్ చేయటానికి కాచుకు కూర్చున్న రాహుల్ లాంటి వాళ్ళకి ఇదో అవకాశంగా చిక్కటంతో విమర్శలు చేస్తున్నారు.అలాగేరాహుల్ శ్రీముఖి విషయమై చిన్న క్లూ దొరికినా చాలు దాన్ని పట్టుకొని పెద్ద రాదంతం చేస్తుండటం మనం గమనించవచ్చు. ఇక హౌస్ లో పునర్నవితో రాహుల్ రెచ్చిపోతూ తనతో డేట్ చేయడానికి కొన్ని కొన్ని కధనాలు కూడా అల్లుతున్నాడని చెప్పాలి .

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *