MOVIE

పునర్నవి విషయంలో రాహుల్ నిజ స్వరూపం బయటపడింది..అడ్డంగా దొరికాడు

బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి కి రాహుల్ తోడుగా ఉంటున్నాడు అనే మాటలు ఎప్పటి నుండో వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళ మధ్య ఎదో నడుస్తుందని అందరికి తెలుసు. అన్ని విషయాల్లో రాహుల్ పునర్నవి కి హెల్ప్ చేస్తున్నాడు. దీనిపై ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. అయినా కానీ రాహుల్ లో ఎలాంటి మార్పు లేదు. అయితే తాజాగా రాహుల్ బిహేవియర్ చూస్తే మాత్రం పునర్నవి తో గ్యాప్ తీసుకోబోతున్నాడా..? లేక ఆమెని అందరి ముందు చులకన చేయాలనీ చూస్తున్నాడా..? అనే అనుమానాలు వస్తున్నాయి. అలీ, శ్రీముఖి, హిమజ వాళ్లతో కూర్చొని పునర్నవి గురించి చెప్పటం జరిగింది. ఆ సమయంలో పునర్నవి తీరుని అలీ తప్పుపడుతున్న కానీ రాహుల్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు.

ఆ తర్వాత బెడ్ రూమ్ ఏరియా లో వితిక దగ్గరకి వెళ్లి, ‘దానికి పని వున్నా లేకపోయినా అక్కడే ఉండేలా వుందే’ అంటూ పునర్నవి .కిచెన్ లో ఉండటాన్ని ఎత్తి చూపిస్తూ వితికతో చెప్పాడు. దీనితో మరింత రెచ్చిపోయిన వితిక ‘ఆమెకి కిచెన్ లోకి వెళ్ళగానే అధారిటీ వస్తుంది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఆమె అంటేనే నాకు కాలుతుందంటూ’ పునర్నవి గురించి మాట్లాడుతుంది. ఈ రెండు విషయాలు గమనిస్తే రాహుల్ కావాలనే పునర్నవి టాపిక్ వాళ్ళ ముందు తీసుకోని వచ్చి, వాళ్ళు ఆమెని విమర్శిస్తున్న సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు. తప్పు, ఒప్పు అనే విషయాలు పక్కన పెడితే మనం ఒకరితో మంచిగా వున్నప్పుడు మనమే పక్కన ఉంది వాళ్ళని తిట్టిపించటం అనేది మంచి పద్దతి కాదు, కానీ రాహుల్ మాత్రం పునర్నవి విషయంలో అదే చేస్తున్నాడు. నాకు పునర్నవి విషయంలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను కూడా ఆమెని వ్యతిరేకిస్తామని హౌస్ మేట్స్ ని నమ్మించటానికి రాహుల్ ఇలా చేస్తున్నట్లు తెలుస్తుంది. వీళ్ళ దగ్గర ఇలా, పునర్నవి దగ్గర మరోలా రాహుల్ ఉంటున్నాడు. అది ఎప్పటికైనా ప్రమాదమే

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *