MOVIE

పునర్నవి రాహుల్ ని ఎందుకు నామినేట్ చేసిందో తెలుసా..? వామ్మో అసలు కథ అదేనా..! బకరా అయినా రాహుల్

బిగ్ బాస్ హౌస్ లో మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో పునర్నవి ఏకంగా రాహుల్ ని నామినేట్ చేయటం జరిగింది. దీనితో హౌస్ మేట్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. ఆమె ఎందుకు రాహుల్ ని నామినేట్ చేసిందో అనే విషయం గురించి బాగానే చెప్పింది. పునర్నవి చెప్పిన కారణాలకి ప్రతి ఒక్కరు కూడా ఓకే చెప్పాలసిందే, ఎందుకంటే రాహుల్ లో ఆ తప్పులు కనిపిస్తున్నాయి. కాకపోతే పునర్నవి ఆలా చెప్పటం వెనుక మరో బలమైన కారణం ఉందని కూడా తెలుస్తుంది. రాహుల్ -పునర్నవి విషయంలో హౌస్ మేట్స్ తో సహా ఆడియన్స్ అందరు కూడా ఒక అంచనాకి వచ్చారు.

వాళ్ళు ఇద్దరు లవ్ లో ఉన్నారని, వాళ్ళకి గేమ్ అవసరం లేదు, కబుర్లు చెప్పుకోవటానికి మాత్రమే వచ్చారనే అభిప్రాయం అందరికి వచ్చింది. దానిని గమనించిన పునర్నవి ఇలాగె ఉంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని, తాను హౌస్ లో ఫ్రెండ్లీ గా వుంటాను, అవసరం అయితే ఏమైనా చేయగలను అనే విషయం అందరికి తెలియాలని, ముఖ్యంగా రాహుల్ మీద అందరూ అనుకుంటున్నట్లు ఏమి లేదని, ఫ్రెండ్షిప్ వరకు ఒకే తప్పితే, గేమ్ పరంగా ఎలాంటి మొహమాటాలు లేవని చెప్పటానికే పునర్నవి రాహుల్ ని నామినేట్ చేయటానికి ప్రధాన కారణమని తెలుస్తుంది. ఒక వేళా రాహుల్ హౌస్ నుండి వెళ్ళిపోతే గేమ్ కోసమే రాహుల్ నామినేట్ చేసింది అనే సానుభూతి ప్రేక్షకుల్లో వస్తుంది. ఒక వేళా అతను వెళ్లకుండా హౌస్ లో ఉంటే, అతని తప్పులు అతనికి తెలియచేసి అతన్ని మార్చింది అనే సానుభూతి రాహుల్ దగ్గర నుండి వస్తుందని పునర్నవి ఆలోచనగా తెలుస్తుంది. వీటిలో ఏది జరిగిన పునర్నవి కి మంచిదే..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *