MOVIE

అలిరేజా పై చేయిచేసుకున్న పునర్నవి , నువ్వు అసలు మనిషివేనా నేను నీ సిస్టర్ లాంటిదాన్నంటూ…

బిగ్ బాస్ లో రోజుకో కొత్త వివాదాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్నా అలికి ,హిమజ ల మధ్య పెద్ద వివాదమే జరిగింది. ఆ సందర్భంలో అయితే అలీని ఏకంగా కలితోనే తన్నింది ఆమె ప్యాంటు జేబులో చేసయిపెట్టాడనే కోపంతో ఆమె అలా బిహేవ్ చేసింది. ఆ తరువాత శ్రీముఖిని ఎప్పటినుంచో టార్గెట్ చేస్తున్న రాహుల్ కూడా శ్రీముఖి మీద గొడవ వేసుకున్నాడు రవిక్రిష్ణకు గాయం కావటంతో ఇక ఆగొడవను అక్కడితో సద్దుమణిగించారు. ఇక నిన్న జరిగిని తాజా ఎపిసోడ్ విషయానికి వస్తే…ఈ నేపథ్యంలో 19వ ఎపిసోడ్‌లో అలీ, పునర్నవిలకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. వచ్చేవారం ఎలిమినేషన్‌ నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి ఈ టాస్క్ విజయవంతంగా పూర్తిచేయాలని బిగ్ బాస్ సూచించారు. సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అలీ, పునర్నవి హౌజ్‌లో ఉన్న సీక్రెట్ రూంలోకి వెళ్లారు.

అలీ, పునర్నవి కనిపించక పోవడంతో బిగ్ బాస్ హౌస్‌మేట్స్ ఒకింత కంగారు పడ్డారు. వాళ్ళిద్దరినీ తిరిగి హౌస్ లో చూడాలనుకునే వారికి కొన్ని కండీషన్స్ పెట్టారు బిగ్ బాస్. ఈ మేరకు వారి కోసం హౌస్‌మేట్స్ కొన్ని త్యాగాలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సీక్రెట్ రూంలో ఉన్న అలీ, పునర్నవి ఎంజాయ్ చేశారు. ఇంటి సభ్యులంతా లివింగ్ రూంలోకి రావాలని బిగ్ బాస్ ఆదేశించారు. అందరూ వచ్చి టీవీ ముందు కూర్చోగానే టీవీలో అలీ, పునర్నవి దర్శనమిచ్చారు. హౌజ్‌మేట్స్ తమను టీవీలో చూస్తున్నట్టు అలీ, పునర్నవికి తెలియదు. ఈ సమయంలో సీక్రెట్ రూంలో ఉన్న అలీ, పునర్నవికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ రూంలో చెట్టుకు ఒక డార్ట్ బోర్డు ఉంది. ఆ బోర్డుపై అలీ, పునర్నవి తప్ప మిగిలిన కంటెస్టెంట్ల ఫొటోలు ఉన్నాయి. వీరందరిలో మీకు నచ్చని ఐదుగురుని ఎంపిక చేసి, దానికి గల కారణం చెప్పాలని వారిద్దరికీ బిగ్ బాస్ ఆర్డర్ వేశారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పూర్తిచేయడంలో భాగంగా అలీ, పునర్నవి హౌస్‌మేట్స్ పేర్లు చెబుతుంటే కంటిస్టెంట్ల హావభావాలు వర్ణనాతీతం.

చివరగా అలీ, పునర్నవిలు సీక్రెట్ టాస్క్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారని వారిద్దరూ వచ్చేవారం నామినేషన్స్‌లో ఉండరని బిగ్ బాస్ చెప్పారు. ఈ సందర్భంగా సీక్రెట్ రూంను వాళ్ల తరఫున ఇంటి సభ్యులకు గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు చెప్పారు బిగ్ బాస్. దీంతో హౌస్‌మేట్స్‌ ఈ కొత్త రూంలో కొద్దీ సేపు సరదాగా ఎంజాయ్ చేశారు. అయితే ఇదంతా జరగక ముందు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ రూమ్ లో అలీ కి రాహుల్ మీద ఉన్న డౌట్ ప్రశ్నలను పునర్నవిని అడిగాడు…నీతో రాహుల్ లవ్ లో పాడాడనుకుంటా కదా కొన్ని రోజులుగా గమనిస్తూనే వున్నాం మేమంతా కూడా ఇద్దరి మధ్య ఎదో లవ్ ట్రాక్ నడుస్తుందని అర్ధమవుతుంది ఏంటి విశేషం అని అలీ అడుగగా పునర్నవి సరదాగా అతని పైన చేయిలపై ఎరా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను అయినా వాడు నన్ను లవ్ లో దింపినా నేను పడను నేను ఒక సైకో దాన్ని ఎప్పుడెలా ఉంటానో నాకే తెలియదంటూ సమాధానమిచ్చింది పునర్నవి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *