MOVIE

బాహుబలి కి కష్టాలు మొదలు..

ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్త మన రెబెల్ స్టార్…బాహుబలి రికార్డు బద్దలుకొట్టిన్నందుకు కాదండోయ్….తన ల్యాండ్ గురించి..అవును ప్రభాస్ ఇంటి స్థలాన్ని ప్రభుత్వ అధికారులు సీజ్ చేసారు ..ఆ విషయాన్నీ మన రెబెల్ ఖండిస్తున్నారు..తాను ప్రభుత్వ నియమాల మీద మండిపడుతున్నారు..తనకి ఎలాంటి ఉతర్వులు జారీ చేయకుండా ఆలా ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు…ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్ర షూటింగ్ లో ఉన్నాడు…తాను షూటింగ్ మధ్య లో ఉన్నపుడు ఇలాంటి న్యూస్ వినాల్సి వచ్చిందని వాపోతున్నాడు..అసలు ఇంతకీ ప్రభాస్ ల్యాండ్ ఎందుకు సీజ్ చేసారు ??దాని వెనుక ఉన్న కథ ఏంటి అంటే??భూ వివాదాల విషయంలో సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఒకటే. ఒకే భూమిని చాలామందికి అమ్మేసే కేటుగాళ్ళకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు వింటూనే వుంటాం. వివాదాస్పద భూముల్ని అంటగట్టేవాళ్ళూ, లేని భూమిని వుందని చూపించి అమ్మేసే ముఠాలు.. వీటికి సంబంధించి మీడియాలో వచ్చే కథనాలూ షరామామూలే.

 

సెలబ్రిటీలు, సామాన్యులు భూ కొనుగోళ్ళ సందర్భంగా ఇబ్బందులు పడ్తుండడమూ మామూలే. ప్రభాస్ కూడా ఎప్పుడు ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు…ఎవరో అమ్మిన భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడటగానీ, ఆ తర్వాత అది వివాదాస్పద భూమి అని తేలిందట. రెగ్యులరైజేషన్‌ కోసం దరఖాస్తు చేయగా, ఆ దరఖాస్తు ప్రస్తుతం పెండింగ్‌లో వుంది..ఈలోగా న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చేసింది చెప్తున్నాడు..కానీ అటుపక్క న్యాయస్థానం మాత్రం ప్రభాస్ కి మేము ఆదేశాలు పంపామని,తానే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని అంటున్నారు..ఈ కేసు న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది..ప్రభాస్ తరపున న్యాయవాదులు గట్టిగానే ఉన్నారు..అవతలివైపున కూడా అలాగే ఉన్నారు..చూడాలి మారె ఈ కేసు ఎప్పటికి తెగుతుందో..?మన బాహుబలికి సినిమాల్లో లాగా నిజ జీవితంలో కూడా కష్టాలు ఎదురవుతున్నాయి..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *