MOVIE

శ్రీముఖిని కాపాడుతున్న నాగార్జున..ఇవిగో ఆధారాలు..

తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు హైలైట్ అవుతారో, ఎవరు ఎప్పుడు డౌన్ అవుతారో చెప్పలేము, హౌస్ లో వాళ్ళు ఉంటే విధానాన్ని బట్టి బిగ్ బాస్ వాళ్ళని బయటకు ఎక్సపోజ్ చేస్తుంటాడు. ఫుల్ యాక్టీవ్ గా వుండేవాళ్ళని ఒక వీక్ టార్గెట్ చేసి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బ తీస్తాడు. మరో వీక్ వాళ్ళకి ఫుల్ ఎనర్జీ వచ్చేలా చేసి వాళ్ళకి తెలియకుండా హౌస్ లో వాళ్ళు ఓవర్ గా బిహేవ్ చేసేలా చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పొతే హౌస్ మేట్స్ యొక్క మానసిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని వాళ్ళని ఒక రేంజు లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం హౌస్ లో అలీ మరియు బాబా భాస్కర్ ని బిగ్ బాస్ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బాబా భాస్కర్ విషయంలో ఎక్కువ ఫోకస్ పెట్టాడు బిగ్ బాస్.

అందుకే బాబాకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చూపిస్తూ అతను ఎలా వుండకూడదో, ఎలా ఉండాలో బిగ్ బాస్ నిర్ణహిస్తున్నాడు. అలాగే అలీ విషయంలో కూడా బిగ్ బాస్ ఫోకస్ పెట్టాడు. ఒక వీక్ నువ్వే తోపు అనేలా చేస్తాడు, ఆ ఊపులో అలీ తప్పులు చేస్తాడు, వాటిని చెపుతూ మళ్ళీ ఆలీకి కౌంటర్లు ఇస్తున్నారు. అయితే హౌస్ లో వీళ్ళు మాత్రమే కాదు ఇంకా చాలా మంది వున్నారు, కానీ వాళ్ళు చేసిన తప్పులను ప్రస్తుతం పెద్దగా చూపించటం లేదు. నిన్నటి టాస్క్ లో మహేష్ శ్రీముఖిని వెన్నుపోటుదారు అంటూ చెప్పాడు. దానికి మహేష్ మాట్లాడుతూ బాబా భాస్కర్ తో గొడవ గురించి మాట్లాడింది, కానీ బయటకు వచ్చి అదేమీ లేదు. వేరే దాని గురించి మాట్లాడా అంటూ చెప్పింది అందుకే వెన్నుపోటు దారుడు అన్నాను అని చెప్పాడు. నిజానికి శ్రీముఖి అంతకంటే పెద్ద వెన్నుపోటు పొడిచింది.

ఆ సమయంలో బాబాతో శ్రీముఖి మహేష్ గురించే తప్పు గా చెప్పింది, మీరు మహేష్ మాటలు వినవద్దు, మిమ్మల్ని మోసం చేస్తాడు అంటూ చెప్పింది. నాగార్జున కావాలి అనుకుంటే దాని వీడియో చూపించవచ్చు కానీ చూపించకుండా దాచిపెట్టాడు. ఆ తర్వాత శ్రీముఖి కవర్ చేయటానికి లేనిపోని అబద్దం చెపుతున్న నాగ్ చూస్తూనే వున్నాడు తప్పితే అది తప్పు అని మాత్రం ఖండించలేదు. దానిని బట్టి చుస్తే శ్రీముఖిని నాగార్జున కాపాడుతున్నట్లు తెలుస్తుంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *