MOVIE

బాబా హద్దులు దాటకు,పెద్దవారు ఆ మాత్రం సెన్స్ లేదా అంటూ నాగ్ సీరియస్ వార్నింగ్…షాక్ లో హౌస్ మేట్స్

బిగ్ బాస్ హౌస్ హోస్ట్ గా నాగార్జున పేరు అనౌన్స్ చేసిన నాటి నుండి షో మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. నాగార్జున గురించి తెలుగు ప్రేక్షకులకి బాగా తెలుసు. ఆయన హోస్ట్ ఎలా ఉంటుందో ఒక అంచనాకి రాగలరు. అందుకు తగ్గట్లే నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ ని సూపర్బ్ గా చేస్తున్నాడు. ఎక్కడ నవ్వించాలో, ఎక్కడ కవ్వించాలో, ఎక్కడ శిక్షించాలో నాగ్ కి బాగా తెలుసు. దానితో ఆయన హోస్ట్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ఆదివారం హౌస్ లో నాగార్జున ఒక చిన్న గేమ్ లాంటిది పెట్టాడు. జడ్జిస్, ప్రాసిక్యూటర్,అక్క్యూజ్డ్ టీంలుగా హౌస్ మేట్స్ డివైడ్ చేశాడు. ఎలిమినేషన్ లో మిగిలిన ఐదుగురిని అక్క్యూజ్డ్ గా, వరుణ్,శివజ్యోతి,అలీరైజా లను జడ్జిస్ గా, మిగిలిన వాళ్ళని ప్రాసిక్యూటర్స్ గా నియమించాడు . ఈ క్రమంలో అక్క్యూజ్డ్ టీంలో ఉన్న బాబా భాస్కర్ గురించి ప్రాసిక్యూటర్స్ టీం లో ఉన్న మహేష్ వ్యతిరేకంగా వాదించాలి, ఇందులో మహేష్ నిజాయితీగా వాదిస్తే అతను మాస్క్ తీసేసి ఇంట్లో ఉన్నట్లు లెక్క.

దీనితో మహేష్ మాట్లాడుతూ బాబా భాస్కర్ గురించి కొన్ని ఆరోపణలు చేశాడు . ఈ సమయంలో బాబా భాస్కర్ మధ్య మధ్యలో అడ్డం వస్తున్నాడు. జడ్జిస్ గా ఉన్న వాళ్ళు బాబాకి చెప్పిన పదే పదే అదే పని చేస్తున్నాడు. చివరికి నాగార్జున చెప్పిన కూడా బాబా భాస్కర్ మధ్యలో ఇన్వాల్ అవుతున్నాడు. ఒక దశలో జడ్జిస్ తమ జడ్జిమెంట్ ఇస్తున్న సమయంలో బాబా మధ్యలో మాట్లాడేసరికి నాగార్జున చాలా సీరియస్ గా హే.. అంటూ వేలుచూపిస్తూ గట్టి వార్నింగ్ లాంటివి ఇచ్చాడు. నాగ్ అలా చేసేసరికి హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. అయితే వెంటనే నాగార్జున దానిని కవర్ చేస్తూ నవ్వే సరికి హౌస్ మేట్స్ అందరు ఒక్కసారి ఊపిరి తీసుకున్నారు. నిజానికి ఆ సమయంలో నాగార్జున కి బాగా కోపం వచ్చినట్లు తెలుస్తుంది . అయితే వెంటనే దానిని కంట్రోల్ చేసుకొని మళ్ళీ గేమ్ ఆడించాడు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *