MOVIE

అక్కడ యాక్టింగ్ చేయాలంటే కుదరదు..కాంటిస్టెండ్స్ కి నాగార్జున హెచ్చరిక

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 జులై 21 న టెలికాస్ట్ అవుతుందని ఆఫీసియల్ గా అనౌన్సమెంట్ వచ్చింది. ఇప్పటికే దీనిపై తెలుగు రెండు రాష్ట్రలో విపరీతమైన క్రేజ్ ఉంది. వరల్డ్ కప్ లో ఇండియా ప్రస్థానం కూడా ముగిసిపోవటంతో ఆడియన్స్ మెల్లగా బిగ్ బాస్ వైపు దృష్టి సాధిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ 3 సంబంధించి ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రకా రకల వ్యక్తులు కెమెరా కనిపిస్తే ఎలా నటిస్తుంటారో, కెమెరా లేకపోతే ఎలా వుంటారో చెపుతూ కొన్ని సీన్స్ చూపించారు. వాటి గురించి నాగార్జున మాట్లాడుతూ కెమెరా కనిపిస్తే చాలు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తారు. కానీ అక్కడ యాక్టింగ్ చేయటానికి కుదరదు, అంత రియాలిటీగానే ఉంటుంది. 24 గంటలు 64 కెమెరాలు మిమ్మల్ని కనిపెడుతూనే ఉంటాయి. నో యాక్టింగ్ ఓన్లీ రియాలిటీ అంటూ నాగార్జున చెప్పటం జరుగుతుంది.

ఇక 21 న స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ షో లో ఎవరెవరు వుంటున్నారు అనే దాని గురించి సరైన సమాచారం అయితే లేదు. శ్రీముఖి,మహాతల్లి,సావిత్రక్క, వరుణ్ సందేశ్, తరుణ్, హెబ్బా పటేల్,వేణు మాధవ్ లాంటి పేరులు కొన్ని వినిపిస్తున్నాయి, అయితే షో స్టార్ట్ అయితే కానీ దానిపై పూర్తిగా క్లారిటీ రాదు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ పై వివాదాలు చుట్టూ ముడుతున్నాయి. యాంకర్ శ్వేతా రెడ్డి మాట్లాడుతూ బిగ్ బాస్ షోలోకి వెళ్లాలంటే వాళ్ళ బాస్ నీ సాటిస్ ఫై చేయాలంట అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. షో కి ముందే ఇలాంటి వివాదాలు వస్తుంటే షో స్టార్ట్ అయిన తర్వాత ఇంకెన్ని వివాదాలు వస్తాయో చూడాలి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *