MOVIE

మ‌న్మ‌ధుడు -2.. హాలీవుడ్ నుండి దిగుమ‌తి

  అక్కినేని నాగార్జున  న‌టించిన ఎన్నో సినిమాలు మంచి హిట్  ను  సాధించాయి .అందులో  అమ్మాయిల‌కు  మెచ్చిన సినిమాలే ఎక్కుగా  ఉన్నాయి. గ‌తంలో వ‌చ్చిన నిన్నే పెళ్ళాడుతా ,గ్రీకు వీరుడు ,మ‌న్మ‌ధుడు వంటి సినిమాలు ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచాయి .అయితే నాగార్జున కేరిర్లో సినిమాల  గురించి చెప్పుకోవాల్సి వ‌స్తే ముందుగా గుర్తోచ్చే పేరు మ‌న్మ‌ధుడు .
                                  నాగార్జున న‌టించిన ఈ  సినిమా  ఎంత హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు ..,అప్ప‌ట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది .ఈ మూవీ రిలీజ్ అయిన‌ప్పుడు ఈ సినిమాలోని డైలాగ్ లు ఒక వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేవిగా వున్న‌ట్లూ అప్ప‌ట్లో నిర‌స‌న‌లు  కూడా చేశారు .  అయితే ఇదంతా మాట్లాడుకోవ‌డానికి ముఖ్య కార‌ణం నాగార్జున మ‌న్మ‌ధుడు సినిమాకి సిక్వేల్ తీస్తున్నారు.
                                  ఈ మ‌న్మ‌ధుడు -2  సినిమాకి   రాహుల్   ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు .ఇందులో హీరోయిన్ గా చాలా మంది పేర్లు విన‌పించాయి .అయితే తెలుగులో మంచి అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న  హీరోయిన్ ర‌కుల్ ను మ‌న్మ‌ధుడు -2సినిమాకి తీసుకున్నారని టాక్ ….అయితే  ఈ సినిమాని వీలైనంత  త్వ‌ర‌గా  ఫినీష్ చేయాల‌ని చిత్ర యునిట్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం .
                                    అంతే  కాదు ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమాకి రీమేక్ అని ,ఇందులో వున్న స‌న్నివేశాలు   అన్ని ఉన్న‌వి ఉన్న‌ట్లుగా చూపించ‌బోతున్నార‌ట‌..,అందుకే ఈ సినిమాను వీలైనంత  త్వ‌ర‌గా కంప్లీట్ చేయాల‌ని చూస్తున్నారని బ‌య‌ట టాక్ విపిస్తుంది   .అయితే ఈ సినిమా రీమేకా..?   కాదా ..?   అనే విష‌యం  సంబంధించి  చిత్ర యునిట్ నుండి ఎలాంటి స‌మాచారం లేదు . నాగార్జున ఈ మూవీ అయిన వెంట‌నే రామ‌రాజు సినిమా స్టాట్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని  స‌మాచారం .

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *