MOVIE

అమ్మ కోరిన ఆ ఒక్క కోరికను నేను తీర్చలేకపోయాను ఛీ.. నేను అసలు మనిషినేనా:మహేష్ బాబు ఆవేదన

అగ్ర కధానాయకురాలు సినీ పరిశ్రమలోనే మొట్టమొదటి సారిగా గిన్నిస్ రికార్డు ను సొంతం చేసుకున్న సీజయ నిర్మల గారు ఆమె స్ఫూర్తితో ఎంతోమంది కధానాయకుల కూడా పైకి వచ్చారు ఒక్క కథానాయకి గానే కాకుండా ఆమె నటనకు మారుపేరుగా కూడా ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్న విజయ నిర్మల గారు బాలనటి దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా తన నటనతో అందరి మతులు పోయేలా లీనమైపోతారు ఆ పాత్రలలో.ఇక ఆమెనిజ జీవితానికి వస్తే ఆమె మరణం వెనుక కొన్ని అనూహ్య సంఘటనలు తలెత్తుతున్నాయి.ఆమె లేని లోటు గురించి తలచుకొంటూ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యం గా తనకు సొంత కొడుకు కాకపోయినా తన సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా చూసుకున్న మహేష్ బాబు తీవ్ర దుఃఖానికి గురయ్యారు 73 వయసులో ఆమె సూపర్ స్టార్ కృష్ణ, అభిమానులను తన కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచి వేస్తూ సుదూర తీరాలకు వెళ్లిపోయారు. ఏడవ ఏటనే బాలనటిగా ప్రస్థానం మొదలు పెట్టిన విజయ నిర్మల ఎన్నో చిత్రాల్లో నటించారు. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా తన సత్తా చాటారు.

44 చిత్రాలకు దర్శకత్వం వహించి అత్యధిక చిత్రాలు డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.దర్శకురాలిగా 50 సినిమాలు పూర్తి చేసి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలని ఆమె తపన పడుతుంటేవారట. అయితే 44 సినిమాలు చేసిన తర్వాత ఆమె అనారోగ్యం పాలయ్యారు. వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో సినిమాలకు దూరం అయ్యారు.అయితే ఆమె కోరిక మాత్రం పూర్తిగా తాను అనుకున్న సినిమాలకు దర్శకత్వం వహించాలని అనుకున్నారు కానీ అనుకోని కొన్ని సంఘటనలు కావచ్చు,లేకా కొన్ని ఆమె అనారోగ్య రీత్యా పరమైన కారణాలు కావచ్చు ఏమైనా సరే తనకు ఆ అదృష్టాన్ని దక్కనివ్వలేదు ఆ భగవంతుడు.ఆరోగ్యం కుదుట పడటంతో 2013లో ఆమె దర్శకురాలిగా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకున్నారు. అయితే ఆమె ప్రయత్నాలు ముందుకు సాగలేదు. దర్శకురాలిగా 50 సినిమాలు చేయాలనే కోరిక తీరకుండానే ఆమె కన్ను మూశారు.ఇక మహేష్ బాబు కూడా తీస్తున్న కొత్త సినిమాలకు ఆవిడే స్వయంగా దర్శకత్వం వహించాలని అనుకున్నారట కానీ అది కేవలం ఒక కల లాగానే మిగిలిపోయిందని మహేష్ బాబు తలుచుకుంటూ రోధిస్తున్నాడు అంతే కాదు తనకి ఎంతో ఇష్టమైన తన మనుమడు నవీన్ కృష్ణ కూడా సినీ పరిశ్రమ వైపు వచ్చి తనుకూడా కొన్ని సినిమాలు చేస్తే చూడాలని అనుకున్నారట, అంతే కాదు తాను సినీ ఫీల్డ్ లోకి రావడం కోసం చాలానే ఖర్చు చూసిందట విజయ నిర్మల.కానీ ఆ కోరిక కూడా తీరకుండానే ఆమె ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందరిని శోకంలోకి కలిచివేస్తుంది.

విజయనిర్మల పార్థివదేహాన్ని గురువారం మొత్తం ప్రముఖుల సందర్శనార్థం ఇంట్లోనే ఉంచి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతిమ యాత్ర శుక్రవారం ఉదయం 8 గంటలకు నానక్ రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని ఫామ్ హౌస్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఇక ఆమె మరణాన్ని తన భర్త కృష్ణ గారు కూడా జీర్ణించుకోలేకా తన తలను టేబుల్ కి వేసుకొని గుద్దుకున్నాడటా ఇక ఈ పరిస్థితిని చుసిన అక్కడి వారు అంతా కూడా ఆయన పడే భాదను చూసి అక్కడి వారికి గుండెలు పగిలేలా బాధేస్తుంది అన్నింట్లోనూతోడుగా నీడగా వున్న ఆమె ఇప్పుడు కృష్ణ గారిని ఒంటరిని చేసిపోవడం చుస్తే తట్టుకోలేకపోతున్నారు మన సినీ వర్గం వారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *