MOVIE

గుడ్ న్యూస్:కెజిఫ్ స్టార్ హీరో యష్ మల్లి రెండవ బిడ్డకు తండ్రి కాబోతున్నాడట..

కన్నడ హీరో యష్ కెజిఫ్ సినిమాతో సూపర్ స్టార్ గా తన ప్రతిభను చాటిన ఘనత అందరికి తెలిసిందే ఈ సినిమా దేశ వ్యాప్తంగా కూడా మంచి హిట్ ను దక్కించుకుంది.ముఖ్యంగా కన్నడలో అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వద్ద కలెక్షన్స్ ను రాబట్టుకున్న ఘనత కూడా ఈ సినిమాకే దక్కడం తో ఈ హీరో ఆ ఒక్క విజయం తో పాపులర్ అయ్యాడు.ఇక తను సినిమాల్లో నటించడానికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి.ఇప్పటికే దర్శకులు కూడా ఈ హీరోతో సినిమాను చేయడానికి క్యూలో వున్నారటా అయితే ప్రస్తుతం మంకు వస్తున్న సమాచారం ప్రకారం హీరో యష్ వాళ్ళ ఇంట్లో మళ్ళీ సంబరాలు జరగబోతున్నాయటా..యష్ ఎంత వేగంగా సినిమాల్లో నటిస్తున్నాడో.. అంతే వేగంగా తన సంతానం విషయంలో కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు. గతేడాది డిసెంబర్‌లో ఓ చిన్నారికి జన్మనిచ్చిన యష్ దంపతులు మళ్లీ రెండో బిడ్డ కోసం రెడీ అయ్యారు. ఇటీవల తన కూతురికి నామకరణం చేసిన ఈ దంపతులు మళ్లీ ఓ శుభవార్తతో అభిమానుల ముందుకు వచ్చారు.

యష్ దంపతులు ఇన్స్‌టాగ్రామ్‌లో తమ రెండో బిడ్డ గురించి ఏం చెప్పారంటే..హీరో యష్, ఆయన భార్య రాధిక శుభవార్తలతో ఇన్స్‌టాగ్రామ్‌ను కుదిపేస్తున్నారు. సుమారు ఆర్నేళ్ల వయసు ఉన్న తమ కూతురికి ఐరా యష్ అని నామకరణం చేసినట్టు ఇటీవల వెల్లడించారు. ఆ పాపను ముద్దుగా బేబీ వైఆర్ పిలుచుకొంటున్నారు. యష్‌లోని వై అక్షరాన్ని, రాధికలోని ఆర్ అక్షరాన్ని జోడించి Baby YR పిలుచుకొంటున్నారు.ఆ విధం గా తన మొదటి కూతురికి నామకరణాన్ని జోడించిన వీరిరువురు కూడా మళ్ళీ రెండవ బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నట్లు వెల్లడించారు అదెలాగంటే మొన్నీమధ్య యష్ దంపతులు తమ కూతురు ఐరాతో కూడిన ఓ క్యూట్ వీడియోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ పాప ప్రకటించినట్టుగా.. ఓ సందేశాన్ని అభిమానులతో పంచుకొన్నారు. నాకు ఓ సోదరి రావడానికి రెడీగా ఉంది అని చెప్పించారు. దాంతో యష్ దంపతులు రెండో బిడ్డ కోసం సిద్దమవుతున్నట్టు స్పష్టం చేశారు.దాంతో ఆ పాప చేసిన ఎక్స్ప్రెషన్స్ ను చూస్తే మా నాన్న చాలా స్పీడ్ గా వున్నాడంటూ ఓ లుక్ ఇచ్చింది ఈ బుడ్డి పాప అంతేకాక ఐరా వీడియోలో కనిపించిన పదాలు ఏమిటంటే.. నేను ఐరాను. నేను ఇప్పుడే ఓ వార్త విని నమ్మలేకపోతున్నాను. మా నాన్న చాలా స్పీడ్‌గా ఉన్నారు. తొందరో.. ఆలస్యమో నాకు తెలియదు గానీ.. మీరు చాలా హ్యాపీగా ఫీలవుతారని తెలుసు. అమ్మా నాన్నలకు మరో బిడ్డ పుట్టబోతున్నారు. పుట్టుబోయే తమ్ముడో, లేదా చెల్లెలికి నా బొమ్మలిస్తాను అని ఐరా చెప్పింది.ఇక ఆ పాప చేసిన అల్లరికి కానీ,ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కు గాను సోషల్ మీడియాలోని నెటిజన్లు ఆ వీడియో మీద తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మొదటి బిడ్డకు సంవత్సరం కూడా రాకుండానే మరో బిడ్డకు అప్పుడే తండ్రి కాబోతున్నారంటూ నెటిజన్లు తమ స్వభావాన్ని వ్యక్తం చేసారు.అయితే ఇక యష్ మాత్రం అన్నిట్లోనూ తెగ స్పీడ్ గా వున్నారు అటూ సినిమాలోనూ ఇటూ తన పర్సనల్ లైఫ్ లోనూ అన్నిట్లో కూడా తన స్పీడ్ ను చూపిస్తూ వున్నాడు.ఇక తాను నటిస్తున్న సినిమా వర్క్ లో యష్ ఫుల్ బిజీ ఐపోయాడు.గతేడాది రిలీజైన కేజీఎఫ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది. కన్నడలోనే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా మరో చిత్రం రాబోతున్నది. ఈ చిత్రాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా మలచడంతో బాలీవుడ్ ప్రముఖులు పలువురు నటిస్తున్నారు. త్వరలోనే కేజీఎఫ్2 ప్రేక్షకుల ముందు రానున్నది.మరి ఈ పార్ట్ 2 కూడా పార్ట్ 1 లాగానే మంచి విజయాన్ని అందుకొని కలెక్షన్స్ ను కూడా రాబట్టుకుంటుందా లేదా అనేది కొన్ని రోజుల వరకు వైట్ చేయాల్సిందే.ఈ సినిమా తరువాత యష్ మరో సినిమా చేసేందుకు కుయిదా ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *