MOVIE

కౌశల్ పై భారీ కుట్ర…బకరాని చేసేశారు.. దానివెనుకున్న వాళ్లెవరు..

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మళ్ళి వార్తలొక్కి వచ్చారు. దాదాపు రెండు మూడు నెలల క్రితం సోషల్ మీడియాలో పెను సంచలనం కౌశల్ అతని యొక్క ఆర్మీ.. బిగ్ బాస్ టైటిల్ విజేత గా కౌశల్ ని నిలపటం కోసం పెద్ద ఉద్యమమే చేశారు.. చివరికి సాధించారు. ఇక బయటకు వచ్చిన కౌశల్ తనకి డాక్టరేట్ వస్తుందని, గిన్నిస్ బుక్ రికార్డ్స్ వాళ్ళు మాట్లాడారని, PMO ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని ఇలా నమ్మశ్యకం కానీ మాటలు చెప్పాడు. కొందరు వీటిని ఫేక్ న్యూస్ అంటే మరికొందరు ఏమో నిజం ఉందేమో అంటూ వున్నారు.కానీ చివరికి తెలిసిందేమిటంటే అవన్నీ ఒట్టి ఫేక్ న్యూస్ లు అని, PMO ఆఫీస్ నుండి ఫోన్ చేసిన చంద్రమోహన్ కావచ్చు. అమెరికా హార్వెర్ట్ బైబిల్ యూనివర్సిటీ డైరెక్టర్ అంటూ ఫోన్ చేసిన రాజేంద్ర ప్రసాద్ కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కేవలం మాటలు చెప్పే డబ్బా రాయుళ్లు.. మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు.. అంటూ కొందరిని మోసం చేసి డబ్బులు తీసుకునే బాపత్తు వీళ్ళు. అలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే కనీసం చేసింది ఎవరు, వాళ్ళ స్టేటస్ ఏంటి..? వాళ్ళ మాటలు నమ్మవచ్చా లేదా..? అని కూడా ఆలోచించకుండా పబ్లిక్ లోకి వచ్చి నాకు డాక్టరేట్ వస్తుంది. PMO కాల్ వచ్చింది. గిన్నిస్ రికార్డు వచ్చింది అంటూ గొప్పలు చెప్పుకొని ఇప్పుడు నవ్వులపాలు అయ్యాడు కౌశల్…

Kaushal Bigg Boss 2 Telugu

అయితే నిజానికి ఇక్కడ కౌశల్ తప్పు అనేది పెద్దగాలేదు.. అప్పటికే టైటిల్ విజేత కావటం, ఎక్కడెక్కడ నుండి ఫోన్స్ రావటంతో తాను ఒక పెద్ద స్టార్ అయ్యిపోయాను అను అనుకున్నాడు. అదే ఊపులో ఇలా వచ్చిన ఫేక్ న్యూస్ కూడా నమ్మేశాడు.. మనం గమనిస్తే మంచిగా ఏమైనా మాట్లాడితే తనకి అది నచ్చితే ముందు వెనుక చూసుకోకుండా వెళ్లిపోయే మనస్తత్వం కౌశల్ ది… ఆ తర్వాత అది తప్పు అని తెలిస్తే నోరుమొహమాటంగా ఒప్పుకొని క్షమాపణ అనేది అడుగుతాడు. అది అతని బలహీనత దానిని ఆసరాగా చేసుకొని కొందరు ఇలాంటి చీఫ్ ట్రిక్స్ అనేవి ప్లే చేశారు. దానిలో కౌశల్ చిక్కుకున్నాడు.. సమాజంలో ఒక స్టేజి లో వున్నప్పుడు మనం చేసే ప్రతి ప్రతి మాట అనేది చాల విలువ అనేది ఉంటుంది. ఎక్కడ పొరపాటు అనేది జరిగిన దానికి తగిన మూల్యం అనేది చెల్లించుకోవాలి.. ప్రస్తుతం కౌశల్ అదే పనిలో వున్నాడు. అయితే కొందరు కౌశల్ అభిమానులు మాత్రం కౌశల్ కి ఇలా ఫోన్స్ చెప్పించి కావాలనే రాంగ్ స్టేట్మెంట్స్ అనేవి ఇప్పించి అతనిని బదనాం చేయాలనీ చూశారు..దీని వెనుక ఎదో కుట్ర ఉందని, దాని వెనుక కౌశల్ అంటే గిట్టని వాళ్ళున్నారని చెపుతున్నారు.. ఒక వేళా నిజమే కావచ్చు. గిట్టని వాళ్ళ పనే కావచ్చు ..కానీ ఇక్కడ కౌశల్ యొక్క ఆలోచన అనేది ఏమైంది..అనుకోని విధంగా ఇలా పేరు ప్రఖ్యాతలు అనేది వచ్చినప్పుడు అదే సమయంలో అనుకోని ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. వాటి పట్ల కూడా జాగ్రతగా ఉండాలి. కానీ కౌశల్ విజయం ఇచ్చిన మత్తులో వున్నాడు తప్పితే ఇలా ఆలోచించే స్థితిలో లేడు..అందుకే ఇలా జరిగింది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *