MOVIE

రజినీకాంత్ ఇక సినిమాలకి గుడ్ బాయ్ చెప్పబోతున్నాడా…?

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు..తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోడు..సినిమాలు తీయడం కొంచెం ఆలస్యం అయినా సరే కానీ సినిమా విడుదల అయిందంటే అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే…శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు…ఇప్పడు విడుదలైన రోబో 2 .O కి ముందు ఒక్క కాల సినిమా ఒక్కటే విడుదల అవడం జరిగింది… మరో వైపు నెల రోజుల్లో ‘పేట’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. పేట సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే రజినీకాంత్ మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయిస్తున్నాడు ..

 

పేట సినిమా రజినీకాంత్ గారికి 166 వ చిత్రం..ఇది మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది… అయన నటనకి ఎలాంటి వారైనా ముగ్దులు అవ్వాల్సిందే…అలాంటి హీరో ఇక సినిమాలకి గుడ్ బాయ్ చెప్తున్నాడు అనే ఊహాగానాలు బాగానే వినిపిస్తున్నాయి..రజినీకాంత్ గారు రాజకీయాల్లోకి రాబోతూఉన్నారు అనే వార్త ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది…ఆ మద్య రజినీ కాంత్ కూడా తన రాజకీయ ప్రవేశం ఉంటుందని ప్రకటించాడు..అది ఎప్పుడు ఎలా అనే విషయంలో క్లారిటీ అయితే ఇవ్వలేదు కాని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి రజినీకాంత్ రాజకీయాల్లో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో కూడా ఉన్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పే ముందు చకచక ఓ నాలుగు సినిమాలు చేసేయాలనేది రజినీ జీ ఆలోచనగా తెలుస్తోంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *