MOVIE

మూడో సారి వాయిదా ప‌డిన నిఖిల్ సినిమా….

 నిఖిల్ హీరోగా ,లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన  సినిమా అర్జున్ సురవరం.ఇందులో నిఖిల్   జర్నలిస్ట్  పాత్ర‌లో న‌టించారు . సంతోష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. జెమినీ టీవీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది.ఈ సినిమా తమిళ్ లో హిట్ అయిన కనిథన్ సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది.అయితే ఈ సినిమా ప్రారంభించిన నాటి నుండి క‌ష్టాలే మొద‌లౌతున్నాయి.
                మొదట ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ పూర్తికాకపోవడంతో మూవీని వాయిదావేశారు..రెండో సారి విడుద‌ల చేయాల‌నుకున్న  స‌మ‌యంలో న‌ట్టి కుమార్ అడ్డుకున్నారు .నిఖిల్ సినిమా టైటిల్ ముద్ర‌ను న‌ట్టికుమార్ వాడుకున్నారు.దీంతో రెండో సారి ఈ సినిమా  వాయిద వేయాల్సి వ‌చ్చింది.
                 అయితే చివ‌ర‌గా అన్ని స‌మ‌స్య‌లు తీరాయ‌నుకొని అర్జున్ సుర‌వ‌రం సినిమాను ఈ నెల 29 న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావించారు .ఇప్పుడు ఇది కూడా వాయిదా ప‌డిన‌ట్లు ఇప్పుడు  వార్త‌లు వ‌స్తున్నాయి.తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం ఈ నెల  29న విడుదల కావాల్సిన ఈ సినిమాను ఏకంగా మే 1కి వాయిదావేశారు. అంటే అచ్చంగా నెల రోజులు వాయిదా వేశారట. ఈసారి మాత్రం వాయిదాకు కారణాలు చెప్పలేదు. ఏది ఏమైనా చెప్పిన టైంకు సినిమాను రిలీజ్ చేయ‌కుండా ఇన్ని సార్లు వాయిదా ప‌డ‌డం ఇదే మొదటి సారి అని చెప్పుకోవాలి .

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *