MOVIE

తమిళ్ నటుడికి రానా స్ట్రాంగ్ వార్నింగ్ …తమిళ్ పరిశ్రమలో అలజడి

తెలుగు సినీ హీరో దగ్గుబాటి రానా చాల రోజుల తర్వాత తనలోని కోపాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాడు..సీనియర్ హీరోయిన్ నయనతార గురించి తమిళ్ సీనియర్ నటుడు మాట్లాడిన మాటలకి రానా దిమ్మతిరిగే రీతిలో సమాధానం ఇచ్చాడు…తమిళ్ నాడులో హీరోయిన్స్ కి గుడికట్టి పూజించే స్థాయిలో అభిమానులు వుంటారు. అలాగే ఆ హీరోయిన్ మీద అప్పుడపుడు విషం చిమ్మే తోటి నటులు కూడా వుంటారు.. తాజాగా నయనతార నటించిన కొత్త సినిమా ట్రైలర్ లంచ్ సందర్భంగా సీనియర్ నటులు రాధా రవి మాట్లాడుతూ నయనతార ని లేడి సూపర్ స్టార్ అని పిలవకండి . ఎంజీఆర్ శివాజీ గణేశన్ లాంటి వాళ్లతో పోలిచితే నాకు చాల హర్టింగ్ గా ఉంటుంది అంటూ ఏదో ఏదో మాట్లాడాడు. అతని మాటలపై తమిళ్ పరిశ్రమ మొత్తం భగ్గుమంటుంది.

మొదటిగా సింగర్ చిన్మయి మాట్లాడుతూ నా విషయంలో ఎవరు పెద్దగా సపోర్ట్ చేయలేదు, కానీ ఒక అగ్రస్థాయి హీరోయిన్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరు మాట్లాడకపోవటం దారుణం. ఆమె నడిగర్ సంఘ సభ్యురాలు అంటూ మాట్లాడింది. ఆ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ రాధారవి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది, అలాగే రాధికా, శరత్ కుమార్ కూడా రాధారవి వ్యాఖ్యలను తప్పు పట్టారు.. నడిగర్ సంఘ అధ్యక్షులు విశాల్ కూడా దీనిని ఖండించాడు. డీఎంకే అధినేత స్టాలిన్ అయితే ఏకంగా రాధారవిని పార్టీ నుండి సస్పెండ్ చేసాడంటే దాని త్రీవ్రత ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోండి.

ఇక దీనిపై తాజాగా రానా తన ట్విటర్ అకౌంట్ లో స్పందిస్తూ “ఇప్పుడు Mr. రాధారవి ఒక అద్భుత నటి గురించి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల గురించి విన్నాను. సర్.. మీ వ్యక్తిత్వం లో ఉండే మాలిన్యాన్ని మీ కామెంట్స్ చూపిస్తున్నాయి. నయన్ అద్భుత నటన సంగతి కూడా మీ వ్యాఖ్యల్లో తెలుస్తోంది. #రాధారవి గారు మీరు ఈ కమ్యూనిటీ కే అవమానం” అంటూ త్రీవ్రమైన స్థాయిలో హెచ్చరించాడు.. ఇప్పడు రానా చేసిన వ్యాఖ్యలు తమిళ్ పరిశ్రమలో హాట్ హాట్ గా నడుస్తున్నాయి.. రానాకీ తెలుగులో ఎంత క్రేజ్ ఉందొ తమిళ్ లో కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉంది. అందుకే రానా మాట్లాడిన మాటలకి అక్కడ అంత అలజడి రేగుతుంది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *