MOVIE

వరుణ్ సందేశ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బిగ్ బాస్..ఇకపై అతనికి ఆ అర్హత లేదంటూ…

బిగ్ బాస్ లో కొన్నిరోజుల నుండి గొడవలు,రొమాన్స్ అనేవి జరగటం చూస్తే ఇక రానున్న రోజుల్లో ఇంకెన్ని వివాదాలకు దారితీస్తాయో అన్న అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరిలోనూ వుంది. అయితే మొన్నటికి మొన్న అలీ రెజా మరియు,హిమజల మధ్య పెద్ద గొడవే జరిగిది ఒక దశలో అయితే అలీ కాళ్ళు కూడా పట్టుకుంది హిమజ అయినా కానీ ఆ గొడవకు ఫుల్ స్టాప్ పడలేదు. ఇక టాస్క్ లో భాగమై శ్రీముఖి కూడా తన టాస్క్ ను గెలిచి ,తన నటనను  నిరూపించుకునేందుకు కొన్ని కుట్రలు చేయక తప్పలేదుఅసలు వివరాల్లోకి పోతే…బిగ్ బాస్ కెప్టెన్ గా నియమించిన వరుణ్ సందేశ్ తన పనులను సక్రమంగా నిర్వహించకపోవడమే కాకా..హౌస్ లోని కంటెస్టెంట్స్ చేత కూడా టాస్క్ లను సరిగా చేయించలేదని బిగ్ బాస్ వరుణ్ పై మండిపడ్డాడు.

హౌస్ లో వున్న ప్రతీ ఒక్క వస్తువును కూడా జాగ్రత్తగా చేసుకోకపోవడం కూడా ఒక కారణమనే చెప్పాలి ఎందుకంటే మొన్నటి టాస్క్లో భాగమై శ్రీ ముఖి గాజు బాక్స్ ని బద్దలు కొట్టింది అది బిగ్ బాస్ వారి వస్తువు కావడంతో ఆ విషయంపై కూడా బిగ్ బాస్ చర్చించాడు అందుకు శిక్షగా శ్రీముఖిని ఈ సీజన్ కి నేరుగా నామినేట్ చేయడం జరిగింది.ఇక వరుణ్ సందేశ్ కూడా తనకు అప్పచెప్పిన పనులను కూడా సరిగా నిర్వర్తించనందుకు ఈ సీజన్ మొత్తానికి కూడా ఇక కెప్టెన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడని తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో బిగ్ బాస్ చెప్పటం జరిగింది బిగ్ బాస్ నిర్ణయానికి వితికా ఒక్కసారిగా నోరు తెరిచి షాక్ అయ్యింది. అసలు అతను ఇంతలా దిగజారడానికి గల కారణం ఒకరకంగా వితిక అని కూడా చెప్పవచ్చు బిగ్ బాస్ లో హస్బెండ్ గా కాకుండా ఒక కంటెస్టెంట్ గా రూల్స్ పాటించి ఉంటే ఈ రోజు వరుణ్ కి ఇలాంటి గతి పట్టేదికాదేమో అన్న టాక్ కూడా వినిపిస్తుంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *