MOVIE

అలీ వర్సెస్ మహేష్ తప్పు ఎవరిదీ..? పుల్లలు పెట్టేది ఎవరు..?

నిన్న బిగ్ బాస్ హౌస్ లో మహేష్ మరియు అలీ మధ్య పెద్ద స్థాయిలోనే గొడవ జరిగింది. అలీ బాబా భాస్కర్ ని నామినేషన్ చేయటంతో గొడవ స్టార్ట్ అయ్యింది. దాని గురించి అలీ బాబాతో కిచెన్ ఏరియాలో మాట్లాడుతున్నాడు. ఎందుకు నామినేషన్ చేయవలసి వచ్చిందో వివరిస్తున్నాడు. ఈ క్రమంలో మహేష్ కలగచేసుకొని ఎదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.ఈ సమయంలో అలీ సీరియస్ అయ్యి నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడి పుల్లలు పెట్టమాకు అంటూ అని చెప్పేసరికి మహేష్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళి కాసేపటికి వచ్చి అలీతో గొడవకి దిగాడు మహేష్ . నేను ఎప్పుడు పుల్లలు పెట్టాను చెప్పు అంటూ అలీతో వాదనకి దిగాడు. అలీ కూడా చాలా గట్టిగానే మహేష్ తో వాదిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరిలో తప్పు కనిపిస్తుంది.

మహేష్ ఉద్దేశ్యంతో ప్రకారం మొదట హౌస్ మేట్స్ అందరం ఉన్నాము కదా..! వాళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా బాబాని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అనేది అడగాలని అనుకున్నాడు. అలీ ఏమో నేను ఉదయం నలుగురిని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని మాత్రమే నామినేట్ చేయాలి కదా మిగిలిన వాళ్ళని ఎలా చేస్తానంటూ మాట్లాడాడు. ఆ సమయంలో ఇద్దరు కొంచం కూల్ అయ్యి మాట్లాడుకుంటే అసలు సమస్యే వచ్చేది కాదు.. ఎవరికీ వాళ్ళు ఆవేశంతో అరవటం వలన గొడవ ఎక్కువ అయ్యింది. ఇద్దరిలో ఎవరు కూడా తాము చెప్పాలి అనుకున్న దానిని కరెక్ట్ గా చెప్పలేదు. ఒక క్లారిటీ అనేది లేకుండా మాట్లాడుకున్నారు. అందుకే అది గొడవకి దారితీసింది. మహేష్ చెప్పేది అలీ వినకుండా పుల్లలు పెట్టేవాడు అని అనేసరికి మహేష్ కి కోపం వచ్చింది. దీనితో అసలు టాపిక్ పక్కకి వెళ్లి వేరే టాపిక్ మీద ఇష్యూ జరిగింది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *