MOVIE

ట్విట్టర్ లో తేడాగా మాట్లాడిన అనసూయ…

అనసూయ జబర్దస్త్ లో బాగా పాపులర్ అయినా యాంకర్.. తన గ్లామర్ తో షో కి ఒక ఊపు తీసుకోని వచ్చిన అనసూయ అడపాదడపా సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ నీ గడుపుతుంది. మధ్యలో కొన్ని విషయాల మీద సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టి అప్పుడపుడు అభిమానుల చేత చివాట్లు తింటుంది. తాజాగా అనసూయ ఎవెంజర్స్ ఎండ్ గేమ్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కాస్త ఆలస్యంగా ఎవెంజర్స్ : ఎండ్ గేమ్ చూశాను నా పనులు అన్ని పూర్తి చేసుకుని సినిమాకు సమయం కేటాయించేందుకు ఇప్పుడు వీలు కలిగింది. నేను మొదటి నుండి కూడా ఎవెంజర్స్ కు వీరాభిమానిని అందుకే ఈ చిత్రంను చూడాలని చాలా ఆశ పడ్డాను. సినిమాలోని కొన్ని సీన్స్ మధురానుభూతులను పంచాయి.

ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే పూర్తి స్థాయిలో సినిమా నన్ను ఆకట్టుకోలేదు. సినిమా నాకు కాస్త నిరాశను మిగిల్చింది. ఎవెంజర్స్ : ఎండ్ గేమ్ నిరాశ పర్చినంత మాత్రాన నేను ఎవెంజర్స్ కు ఫ్యాన్ ను కాకుండా పోను. నేను రాబోయే 21 సినిమాలను కూడా చూస్తాను. అయితే ఎండ్ గేమ్ ను మాత్రం మళ్లీ చూడాలని నేను అనుకోవడం లేదు. నాకు ఈ చిత్రం ఎందుకు నిరాశ పర్చిందనే విషయాన్ని నేను తర్వాత చెప్తాను. ఆ విషయాలు చెప్పి అభిమానులను నిరాశ పర్చడం నాకు ఇష్టం లేదు అంది.

అనసూయ వ్యాఖ్యలపై రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. అందరిది ఒక దారి అయితే అనసూయది మరో దారి ఆమె తేడా అనుకున్నాం కాని మరీ ఇంత తేడానా అంటూ ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక మరో వ్యక్తి వార్తల్లో ఉండేందుకు ఎవెంజర్స్ గురించి అనసూయ ఇలా కామెంట్స్ చేసిందని అన్నాడు. మరి కొందరు మాత్రం అనసూయ స్పందనను సమర్ధించారు.. ప్రముఖ రచయిత శోభాడే కూడా విమర్శలు చేసింది. నా జీవితంలో ఇంత చెత్త సినిమా చూడలేదు అంటూ కామెంట్ చేసి అందరిని ఆశ్చర్య పర్చింది. 11 ఏళ్ల కాలంలో మార్వెల్ సీక్వెల్ లో వచ్చిన అతి బోరింగ్ సినిమా ఇదేనంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా అనసూయ చేసిన వ్యాఖ్యలు పై ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి. కేవలం ఒక్క ఇండియా లోనే 400 కోట్లు వసూళ్లు చేసిన సినిమా గురించి ఆమె ఆలా మాట్లాడటం పై అవెంజర్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *