MOVIE

అక్కినేని మజ్ను సినిమా రివ్యూ..

ప్రతి మనిషిలో ప్లస్ లు మైనస్లు ఉంటాయి. మన మైనస్లు తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని ముందుకి వెళితే అతను సక్సెస్ సాధించటం పెద్ద కష్టమేమి కాదు. . మొదటి సినిమాలో తన లెవెల్ ని ఎక్కువగా ఉహించుకొని సినిమా తీసి దెబ్బ తిన్న అక్కినేని అఖిల్ రెండో సినిమాకి కొంచెం దారిలోకి వచ్చాడు, కానీ పూర్తిగా సక్సెస్ ని మాత్రం అందుకోలేదు. ఈ రెండు సినిమాలు ద్వారా నేర్చుకున్న అఖిల్ తన మూడో సినిమాతో తనకి ఎలాంటి సినిమాలు నప్పుతాయి, తన నుండి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటారో అలాంటి సినిమానే ఎంచుకొని ప్రేక్షకుల ముందుకి వచ్చాడు అదే మజ్ను. ఈ సినిమాలో స్టోరీ పరంగా పెద్ద పెద్ద ట్విట్స్, అలాగే ఊహలకి అందని స్థాయిలో ఉండే సన్నివేశాలు కూడా ఏమి లేవు. కానీ మనకి తెలిసిన విషయాలనే, మనం చూస్తున్నా సంఘటనలని ఎంతో సున్నితంగా హాస్యం కలగలిపి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేశారు..ఈ ప్రయత్నంలో దర్శకుడు, హీరో ఇద్దరు కూడా సఫలం అయ్యారు. కష్టాలు కన్నీరు లాంటివి తెలియకుండా పెరిగి ప్రేమ అంటే వన్ ఆర్ టు మంత్స్ రిలేషన్ షిప్ గా ఫీల్ అయ్యే ఒక కుర్రాడికి, పెళ్లి అంటే భర్త అంటే శ్రీరామ చంద్రుడిగా ఉండాలి అనుకునే ఒక అమ్మాయి ఎదురుపడటం, ఇష్టమలేకపోయిన తప్పక అతడితో జర్నీ చేయటం, ఈ జర్నీ లో తన ఆలోచనలు మార్చికొని అతడిని ప్రేమించటం, ప్రేమ అంటే 30 రోజుల బంధమే అనుకునే అతను ఆమె చూపించే ప్రేమని ఒక రకమైన టార్చర్ లాగా ఫీల్ అవటం, దీనితో ఆమె అతనికి దూరంగా పోవటం, ఆ తర్వాత అతను ఆమెని ఎంతగా మిస్ అవుతున్నాడో తెలుసుకొని అదే ప్రేమని అర్ధం చేసుకొని ఆ అమ్మాయి మనసును మార్చి తన తనని చేసుకోవటం కోసం ఆమె దగ్గరకి వెళ్లి చివరికి అది ఇది చేసి ఆమెని సొంతం చేసుకోవటం అదే సినిమా స్టోరీ.

 

Akkineni Majnu Review

ఇలాంటి స్టోరీలు చాలా వచ్చాయి కానీ, వాటి కంటే బిన్నంగా ఈ సినిమా సాగుతుంది… నేటి తరానికి సెట్ అయ్యేలా సన్నివేశాలు డైలాగ్స్ రాసుకోవటం అలాగే వాటిని చెప్పటానికి ముందు అందుకు తగ్గ బ్యాక్ గ్రౌండ్ సిద్ధం చేసుకొని పర్ఫెక్ట్ గా చెప్పటం జరిగింది. తెలిసిన కథని మళ్ళి చెప్పాలంటే ఇలాంటి లాజిక్స్ అనేవి అవసరం. జరుగుతున్నా ప్రతి సీన్ కి కూడా ఒక రకమైన ఎమోషన్ అటాచ్ అయివుండాలి..అప్పుడే ప్రేక్షకుడు ఎంజాయ్ చేయగలుగుతాడు..సో ఆ విధమైన లాజిక్స్ అనేవి ఈ సినిమాలో ఎక్కడ మిస్ కాకుండా సినిమాని ముందుకి తీసుకొనివెళ్ళాడు. కథ గురించి సినిమా గురించి ఇంతకూ మించి ఎక్కువ చెప్పకూడదు. మీరే థియోటర్లలో చూడండి. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి గురించి చెప్పాలంటే మనకి తెలిసిన విషయాలనే పేర్చి వాటిని హృదయానానికి హత్తుకునేలా, చిలిపి హాస్యంతో చెప్పటం అతని గొప్పతనం. మొదటి సినిమా తొలిప్రేమలో కూడా ఎంతో సున్నితమైన లవ్ స్టోరీని బాగా చెప్పాడు. ఈ సినిమాలో అదే స్థాయిలో మెప్పించాడు. ఇక హీరో అఖిల్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో అతనిలో చాల ప్లస్ పాయింట్స్ బయటకు వచ్చాయి. గత సినిమాలో స్టోరీని వేరుగా హీరోని వేరుగా చూసేవాళ్ళం, ఎందుకంటే సినిమా స్టోరీతో హీరో జర్నీ చేస్తున్నట్లు మనకి అనిపించేది కాదు, కానీ ఈ సినిమాలో స్టోరీ పాటుగా హీరో జర్నీ సాగుతుంది. ముఖ్యంగా అఖిల్ విషయంలో అప్పుడడపు మనం కొంచెం బయటకు వచ్చిన కానీ, ఎక్కువ భాగం విక్కీ అనే చారెక్టర్ తోనే మనం జర్నీ చేస్తాం. విక్కీ అంటే ఈ సినిమాలో అఖిల్ పేరు. విక్కీ నవ్వితే మనం నవ్వుతాం, విక్కీ ఫ్లర్టింగ్ చేస్తే మనం చేసినట్లే ఫీల్ అవుతాం, విక్కీ ఏడిస్తే మనం ఏడుస్తాం, ఆలా మనల్ని తనతో తీసుకొనిపోతాడు అఖిల్ అదేనండి విక్కీ . కాకపోతే అఖిల్ ఇంకొంచం బెటర్ గా చేయవలసిన సన్నివేశాలు వున్నాయి. వాటిలో కూడా బాగానే చేశాడు. బట్ అది సరిపోలేదు అక్కడ సన్నివేహాసాలకి, కాకపోతే మూడో సినిమానే కాదా..సో అలంటి వాటిల్లో మెరుగవటానికి ఇంకా కొంచం టైం అనేది కావాలి. ఓవర్ అల్ గా అఖిల్ గత రెండు సినిమాల్లో కంటే ఈ సినిమాలో మెరుగ్గా నటించాడనే చెప్పాలి .. ఇంకా హీరోయిన్ నిధి ఆరాగ్వాల్ సినిమాలో తన పేరు నిక్కీ..అరేయ్ విక్కీ నిక్కీ పేర్లు భలే ఉన్నాయే, పేరులకి తగ్గట్లే సినిమాలో వాళ్ళ జోడికూడా సూపర్బ్ గా ఉంది.. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నాగచైతన్య ఏ మాయ చేసావే సినిమాలో నాగ చైతన్యకి పోటీగా సమంత ఎలా అయితే నటించి మెప్పించిందో ఈ సినిమాలో నిది కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది..ఆమె స్క్రిన్ ప్రజెంటేషన్, ఆమె అప్పీరియన్సు ఈ సినిమాకి చాల ప్లస్ అయ్యాయి.

 

 

Akil New Movie

విక్కీ నిక్కీ కూడా పోటాపోటీగా నటించి మెప్పించారు. ఇక సపోర్ట్ రోల్స్ చేసిన రావు రమేష్, నాగబాబు , జయప్రకాశ్, సితార, పవిత్ర లోకేష్ తమ పాత్రలకి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఇక కామెడీ యొక్క బాద్యతనికి ప్రియదర్శి, హైపర్ ఆది, విద్యలేఖ లాంటి తీసుకోని సినిమాకి సపోర్ట్ ఇచ్చారు. సుబ్బరాజు ఒక్క పక్క కామెడీ మరోపక్క సపోర్ట్ రోల్ తో ఆకట్టుకున్నాడు. ఇక సినిమాలో మరో విశేషం ఏమిటంటే దిల్ రాజు మనవడు ఆర్నాష్ కూడా నటించాడు. భలే క్యూట్ గా సూపర్బ్ గా వున్నాడు, అరేయ్ చిన్నపిల్లాడు గురించి కూడా అంత బాగా చెప్పాలా అని అనుకోవద్దు.. ఆ బుడ్డోడి పాత్ర కూడా ఈ సినిమా విజయంలో ఒక భాగంగా ఉంది, అది సినిమాలో మిరే చూడండి.. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగా ఇచ్చాడు. బహుశా తన గురువు మణిశర్మ దగ్గర మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలా ఇవ్వాలో నేచుకొని ఉంటాడు. కాకపోతే ఈ సినిమాలో పెద్దగా రిజిస్టర్ అయ్యే పాట అనేది లేకపోవటం పెద్ద వెలితే అని చెప్పాలి. సినిమాలో సాంగ్స్ వచ్చినప్పుడు మనం చుసిన కానీ బయటకు వచ్చాక ఒక పాటను కూడా గుర్తుపెట్టుకోలేకపోటం.. మ్యూజికల్ గా అది ఒక లోటనే చెప్పాలి. ఇక నిర్మాణ విలువలు BVNS ప్రసాద్ గారికి తగ్గట్లే చాల రిచ్ గా వున్నాయి. ఎందుకో అయన సినిమాలు అంటే చాలు కచ్చితంగా ఫారిన్ సన్నివేశాలు ఉంటాయి.అవి ఉంటేనే సినిమా చేస్తానని చెపుతాడేమో, అయితే ఫారిన్ సీన్స్ అన్ని సినిమాకి సరికొత్త ఫీల్ తీసుకోని రావటానికి ఉపయోగపడ్డాయి. ఇక ఫైనల్ గా చెప్పాలి అంటే అక్కినేని హీరో మొదటిసారి కంప్లైట్ హిట్ కొట్టాడు. నాన్నకి అన్నకి బాగా కలిసివచ్చిన లవ్ ఫార్మేట్ లోనే అఖిల్ హిట్ కొట్టటం విశేషం.. చివరిలో ఒక మాట ఈ సినిమా చుసిన తర్వాత టాలీవుడ్ లో మన్మధులు అని, అక్కినేని హీరోలని ఎందుకు పిలుస్తారో ఒక క్లారిటీ వస్తుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 7 అవుట్ అఫ్ 10

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *