MOVIE

ABCD ట్రైలర్ రివ్యూ ఈసారి గట్టిగా కొట్టేస్తాడు

సినీ రంగంలో బ్యాక్ గ్రౌండ్ అనేది బ్యాక్ బౌన్ లాంటిదని చాల మంది చెపుతారు. కానీ బ్యాక్ గ్రౌండ్ వున్నా వాళ్ళని అడిగితె మాత్రం అది మాకు కేవలం ఒక ఎంట్రీ టికెట్ లాంటిదే, ఆ తర్వాత అంత మా ఆట మేమె ఆడుకోవాలని చెపుతారు. అది కూడా నిజమే.. మెగా ఫ్యామిలీ నుండి డజన్ మంది హీరోలు వున్నారు. వాళ్లలో అల్లు శిరీష్ ఒకరు.. చాల ఏళ్ల నుండి తనదైన హిట్ కోసం ట్రై చేస్తూనే వున్నాడు. గౌరవం, కొత్త జంట, శ్రీరస్తు, శుభమస్తు, ఒక్క క్షణం లాంటి సినిమాలతో మన ముందుకి వచ్చిన కానీ ఎదో యావరేజ్ హిట్స్ మాత్రమే సొంతం చేసుకున్నాడు.. తాజాగా అయన ABCD అనే సినిమాతో మన ముందుకి రానున్నాడు.. దానికి సంబంధించి ట్రైలర్ విడుదల అయ్యింది.

సురేష్ ప్రొడక్షన్ లో బిగ్ బెన్ సంస్థతో కలిసి మధుర శ్రీధర్ ఈ సినిమాని నిర్మించాడు.. మంచి అభిరుచి కలిగిన కొద్దీ మంది నిర్మాతల్లో ఒకరైన మధుర శ్రీధర్ గారు సినిమా చేస్తున్నారంటే అందులో ఎంతో కొంత విషయం ఉంటుంది. అలాగే జాగ్రత్త పరుడైన సురేష్ బాబు ఒక సినిమాకి ప్రొడక్షన్ సపోర్ట్ ఇస్తున్నదంటే అది కచ్చితంగా హిట్ కిందే లెక్కకట్టవచ్చు..మలయాళంలో దుల్కర్ సల్మాన్ ఈ సినిమా చేసాడు. అక్కడ ఘన విజయం సాధించింది.. దానికి రీమేక్ ఈ సినిమా.. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఆ విషయం అర్ధం అవుతుంది.. అమెరికాలో పుట్టి అక్కడ బాగా ఎంజాయ్ లైఫ్ కి అలవాటు పడిన కుర్రాడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ పరిస్థితులకి ఎలా అడ్జస్ట్ అయ్యాడనే మెయిన్ పాయింట్ మీద స్టోరీ నడుస్తుంది. కేవలం దానిని మాత్రమే కాకుండా కొంచం పాలిటిక్స్ ని కూడా టచ్ చేసారు ఈ సినిమాలో ట్రైలర్ లో దానినే సస్పెన్స్ గా చూపించారు.

ట్రైలర్ చూపించిన లవ్ ట్రాక్ కూడా నేటి యువతరానికి కనెక్ట్ అయ్యేలా వుంది.. ఇక అల్లు శిరీష్ మునుపటికంటే కూడా చాల గ్లామర్ లుక్ లో కనిపిస్తుంది.. నటన పరంగా కూడా మంచి మార్కులే పడే ఛాన్స్ వుంది. ఇందులో హీరో ఫ్రెండ్ గా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన భరత్ కనిపిస్తుంది. హీరోతో సమాంతరంగా సినిమా మొత్తం వుండే క్యారెక్టర్ గా అనిపిస్తుంది. అలాగే వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలోని కామెడీ ట్రాక్ ని మోసేలే కనిపిస్తున్నాడు.. ఇక హీరోయిన్ రూక్షర్ కూడా క్యూట్ లుక్ తో కట్టిపడేస్తుంది.. ట్రైలర్ చూపించిన రెండు మూడు సన్నివేశాల్లోనే బాగా నచ్చేస్తుంది. ఇక మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా మరో మెట్టులో ఉన్నట్లు అనిపిస్తుంది ..మెల్ల మెల్ల మెల్లగా అనే సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమాతో అల్లు శిరీష్ ఈ సరి మాత్రం నికార్సైన హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.. ఆ సంగతి తెలియాలంటే మాత్రం మే 17 దాక ఎదురు చూడాలసిందే..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *