రోజుకో ఐదు ఇవి తింటే చాలు…
జీడిపప్పు,బాదాం,కిస్మిస్ లను ఎప్పుడు తింటూనే ఉంటాం కదూ..ఈ సరి వాటితోపాటు వాల్ నాట్ లను చేర్చుకోండి…ఎన్నో లాభాలు ఉంటాయి…బాగా ఆకలిగా ఉన్నపుడు చిరుతిళ్ళకు బదులు వాల్ నాట్ లను తిని చూడండి…ఐదు తీసుకున్న చాలు పొట్ట నిండినట్టుగా అనిపిస్తుంది…వీటిలోని పాలీశాచురే టెడ్ ఫ్యాట్ల వల్ల త్వరగా ఆకలి వేయదు..
*చదువుకునే పిల్లలకు ఇవి చాలా మంచివి..వీటిలోని ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు మెదడు పనితీరుని చురుగ్గా ఉంచుతాయి.తరచూ తీసుకునే పిల్లలో ఏకాగ్రత పెరుగుతుంది.మతిమరుపు సమస్య కూడా దరిచేరదు.
*వీటిలో మాంసకృత్తులు ,పిండి పదార్తాలు,విటమిన్లు,ఖనిజాలు అధిక మోతాదులో లబిస్తాయి.వీటిని తినడం వల్ల ఆ పోషకాలన్నీ శరీరంలో జీవక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి.వాటి వల్ల శరీరంలో చేదు కొలెస్టరాల్ శాతం కూడా తగ్గుతుంది.
*గుండె పనితీరుని మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్రా పోషిస్తాయి.ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ,మెనోసాచురాయిడ్ ఫ్యాటీ ఆమ్లాలు మేలు చేసే కొలస్ట్రాల్ ను అందిస్తాయి.హృదయానికి రక్త సరఫరా సక్రమంగా అందేలా చేస్తాయి.
*రక్తపోటు లేదా మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు ఒక ఐదు గింజలు తీసుకుంటే మంచిది.ఇందులోని పోషకాలు ఆ సమస్యల్ని అదుపులో ఉంచుతాయి.
*వాల్నుట్ల లోని పోషకాలు ఎముకలు దృడంగా ఉండటానికి తోడ్పడుతాయి.జీవక్రియ రేటుని మెరుగుపరుస్తాయి..