HEALTH CARE

ముఖానికి కల తెచ్చే కాఫీ పూత..

 

మారుతున్న ప్రపంచంలో తిరుగుతున్నా కొద్దీ మన మొహం నిర్జీవంగా మారుతున్నది..దానికి కారణాలు ఎన్నో కావచ్చు..కానీ ముఖ్యంగా దుమ్ము,దూళి ఎక్కువగా మన దారికి చేరడంతో మృత కణాలు ఎక్కువగా అయ్యాయి.దాంతో చర్మం నిర్జీవంగా మారుతుంది..అందువల్ల చర్మపై ముడతలు,మచ్చలు ఎక్కువై చర్మం నిర్జీవంగా కనిపిస్తూ అందవికారంగా తయారవుతుంది..ముఖ్యంగా అమ్మాయిలకి ఈ ఇబ్బందులు బాగా ఎదురవుతున్నాయి..ముఖ సౌందర్యం కోసం వారు చేయని పనులు అంటూ ఏమి ఉండవు.. మనం ఎప్పుడైనా బయటకి వెళ్లినపుడు దుమ్ము,దూళి చర్మం పై ఎక్కువగా పేరుకుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు దూరం చేయకపోతే చర్మం నిర్జీవంగా ,కాంతివిహీనంగా మారుతుంది. అందుకే ఈ నియమాలు పాటించి చూడండి..

*బొప్పాయిలో ఉండే ఎంజైములు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.రెండు చెంచాల ఆ గుజ్జులో కొద్దిగా ఆలీవ్ నూనె,చక్కర కలిపి పూతలా వేసుకోవాలి.పావు గంటయ్యాక మర్దన చేసుకొని కడిగేసుకోవాలి.ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తుంటే ముఖంపై పేరుకున్న మురికితో పటు నలుపుదనం తొలగిపోయి శుభ్రపడుతుంది.చక్కటి ఛాయా సొంతమవుతుంది.

coconut-oil

* కొబ్బరినూనెలో కొద్దిగా చక్కర,అరచెంచా ఆలీవ్ నూనె కలిపి ముఖానికి, మెడకి మర్దన చేసుకోవాలి .పది నిమిషాల తరవాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే మురికి తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది. తేమ కూడా అంది కాంతిమంతంగా కనిపిస్తుంది.

* పావుకప్పు ఓట్స్ పొడిలో,కొద్దిగా పెరుగు,పసుపు,గులాబీ నీళ్లు కలపాలి.ఈ మిశ్రమంతో ముఖానికి మర్దన చేసి..అరగంటయ్యాక కడిగేసుకుంటే మృత చర్మం తొలగిపోయి నిగారింపును సంతరించుకుంటుంది.ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళు ఈ చిట్కాను పాటిస్తే సరిపోతుంది

*రెండు చెంచాల కాఫీ పొడిలో చెంచా బాదాం నూనె,కొద్దిగా కొబ్బరి నూనె కలిపి పూటలా వేసుకోవాలి.కాసేపయ్యాక తడిచేత్తో మర్దన చేసుకొని చల్లటి నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి.కాఫి పొడి నిర్జీవంగా మరీనా చర్మానికి జీవాన్నిస్తుంది.బాదాం నూనె చర్మానికి తేమను అందిస్తుంది.అంతే కాదు ఈ పూత వల్ల కాళ్ళ కింద నల్లటి వలయాలు,వాపు ,చర్మం సాగిపోవడం వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి.

* మూడు చెంచాల బియ్యం పిండిలో సరిపడినంత తేనే కలిపి ముఖానికి రాసి..పది నిమిషాల పాటు మర్దన చేయాలి.కాసేపయ్యాక చల్లటి నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. మోయిస్తూరైజర్ ని రాసుకోవాలి..ఇలా చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *